April 18, 2024
తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకత చెప్పాల్సిన పనిలేదు. మొదట నన్ను దోచుకుందువటే అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది. కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్న విధంగా గుర్తింపు దక్కలేదు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కి జోడిగా నటించింది.
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ సంగతి పక్కన పెడితే.. కరోనా కంటే ముందు బాగానే ట్రెండ్ అయింది. వరుసగా హిట్లు వచ్చాయి. కానీ కరోనా తరువాత ఆమె పరిస్థితి మారిపోయింది. మధ్యలో ఒక సినిమా షూటింగ్ లో గాయపడటం, యాక్సిడెంట్ అవ్వడంతో రెస్ట్ తీసుకుంది. అలా ఒక ఏడాది పాటు మంచానికే పరిమితం అయ్యింది ఉంది. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ నభా నటేష్ నటుడు హీరో ప్రియదర్శకి వార్నింగ్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే తాజాగా నభా నటేష్ లేటెస్ట్ రీల్ ని ఒకటి షేర్ చేసింది. ఈ రీల్ మీద నటుడు, హీరో ప్రియదర్శి స్పందించాడు. వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్.. డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నభా నటేష్ వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుని చూపించింది. ఇలా డార్లింగ్ అని పిలిస్తే శిక్ష విధిస్తారని, మాటలు కాస్త జాగ్రత్త అని కౌంటర్ వేసింది. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నభా నటేష్, ప్రియదర్శి ట్వీట్ల మీద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di
— Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024
Read More: అప్పుడే పవన్ తో ప్రేమలో పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన రేణు దేశాయ్!