అప్పుడే పవన్ తో ప్రేమలో పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన రేణు దేశాయ్!

April 18, 2024

అప్పుడే పవన్ తో ప్రేమలో పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన రేణు దేశాయ్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటి రేణు దేశాయ్ ఒకరు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె తొలి సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో నటించి ఆయన ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చినటువంటి రేణు దేశాయ్ అనంతరం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉన్నారు. ప్రస్తుతం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ పలు సినిమాలలో నటిస్తున్నటువంటి రేణు దేశాయ్ ఎన్నో సందర్భాలలో తన ప్రేమ పెళ్లి విడాకుల గురించి తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఉన్న సమయంలో ఎంతోమంది ఆయన పెళ్లిళ్ల గురించి అలాగే విడాకుల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రేమ గురించి తెలియజేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బద్రి సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ ని చూడగానే తాను ప్రేమలో పడ్డానని రేణు దేశాయ్ వెల్లడించారు.

రామానాయుడు స్టూడియోలో తమ్ముడు సినిమా షూటింగ్ జరుగుతుంది . పూరి జగన్నాథ్ బద్రి సినిమా కథతో పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యారు ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను ఈ సినిమాలో హీరోయిన్ గా ఆడిషన్ ఇవ్వడానికి రామానాయుడు స్టూడియోకి వెళ్లానని తెలిపారు. ఇక ముందు పూరి జగన్నాథ్ వెనుక పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఎంతో హడావిడిగా ఉండడంతో హీరో వస్తున్నాడని నాకు అర్థమైంది.

ముందు వస్తున్నటువంటి పూరీ జగన్నాథ్ చాలా హడావిడిగా చేసిన వెనక వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా నడుచుకుంటూ వచ్చి పక్కన కూర్చున్నారని అలా ఆయన సింప్లిసిటీ చూసి తాను ప్రేమలో పడిపోయానని రేణు దేశాయ్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే గర్వం ఏ మాత్రం లేకుండా హీరో అనే అహంకారం లేకుండా తాను చాలా సింపుల్ గా ఉండడం చూసి తన ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ తమ ప్రేమ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: Mirai Telugu Glimpse: ‘మిరాయ్’ గా వస్తున్న హనుమాన్ హీరో.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్ . అశోకుడి రహస్యంతో ‘మిరాయ్’..

ట్రెండింగ్ వార్తలు