July 27, 2021
తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది దృక్కోణాలు, తొమ్మిది కథలు.. వీటి సమాహారంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న విడుదలవుతున్నఅంథాలజీ నవరస
. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ ఈ అంథాలజీని రూపొందించారు. మానవ జీవితంలోని తొమ్మిది రసాలు(భావోద్వేగాలు).. ప్రేమ, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భయం, జుగుప్స, ఆశ్చర్యపోవడం, శాంతి కలయికతో.. తమిళ సినిమాకు సంబంధించిన అద్భుతమైన క్రియేటివ్ పర్సన్స్ అందరూ ఇండియన్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లార్జర్ దేన్ లైఫ్ మూమెంట్ ఈ అంథాలజీని రూపొందించారు.
నవరస
పాండమిక్ సమయంలో ఇబ్బందులు పడ్డ తమిళ సినిమా కార్మికుల కోసం ఆపన్న హస్తం అందించడానికి రూపొందిచబడినది. అరవిందసామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్, ప్రియదర్శన్, రతీంద్రన్ ఆర్.ప్రసాద్, ఎస్.అర్జున్ వసంత్ ఎస్.సాయి వంటి తొమ్మిది మంది గొప్ప దర్శకులు.. ప్రతి రసానికి(భావోద్వేగం) ప్రాణం పోయడానికి కలిసి కట్టుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగస్ట్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది.