Nivetha Thomas: జమాల్ కుడుకి నివేదా థామస్ స్టెప్పులు..ఇంత లావైందేంటి?

December 28, 2023

Nivetha Thomas: జమాల్ కుడుకి నివేదా థామస్ స్టెప్పులు..ఇంత లావైందేంటి?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్(Nivetha Thamas) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఈమె 2016లో నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీస్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నివేదా థామస్. మొదటి సినిమాతోనే యూత్లో మంచి క్రేజ్ ని ఏర్పరచుకోవడంతో ఈ ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోస్ సరసన అవకాశాలు దక్కాయ్. నానితో నిన్ను కోరి, ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించాయి. ఈ సినిమాల తర్వాత కూడా విభిన్న కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే బ్రోచేవారెవరు సినిమాలోను నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని వి సినిమాలోనూ నటించిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే ఈ సినిమా తర్వాత నివేద థామస్ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అంజలితో కలిసి నటించింది నివేద థామస్. వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించగా నివేద థామస్ తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్ని బాగానే ఉన్నా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం సరిగా రావడం లేదు.. దీంతో ఈ మధ్యకాలంలో ఈమె ఏ సినిమాలలో కూడా కనిపించడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నివేదా థామస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోలో నివేదా థామస్(Nivetha Thomas) గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. చాలా లావుగా బొద్దుగా తయారయింది. కాగా ఆ వీడియోలో ఆమె లేటెస్ట్ మూవీ అనిమల్ మూవీలో జమాల్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క క్షణం ఆ వీడియో వైపు అలాగే చూస్తే గానీ నివేదా థామస్ అని గుర్తు పట్టడం కష్టమే. అంతగా లావుగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది నివేదా

Read Moreఎరుపెక్కిన జాన్వీ కపూర్.. ఒళ్లంతా పూసుకున్న దేవర బ్యూటీ

Related News

ట్రెండింగ్ వార్తలు