ఏంటి? రెండు నెలల్లోనే ఇంత మార్పా?.. నోయల్ ఫోటో వైరల్!

January 6, 2024

ఏంటి? రెండు నెలల్లోనే ఇంత మార్పా?.. నోయల్ ఫోటో వైరల్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ సింగర్ నోయల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మేల్ సింగర్స్ లో నోయల్ కూడా ఒకరు. కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. సింగర్ గా మాత్రమే కాకుండా బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు నోయల్. ఈగ, కుమారి 21ఎఫ్ సినిమాలతో నోయల్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. 2019 లో నటి ఈస్టర్ నోరోన్హా ను పెళ్లి చేసుకున్నారు నోయల్.

పెళ్లయిన కొద్ది రోజులపాటు బాగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత భార్యా భర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. కాగా సంభవామి యుగే యుగే అనే సినిమాతో నోయల్ నటుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒకప్పుడు రేడియో జాకీగా కూడా పని చేశారు. కుమారి 21ఎఫ్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నోయల్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. అలాగే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయిన పలు టీవీ షోలకు నోయల్ యాంకర్ గా పని చేశారు. అప్పుడప్పుడు ఏదైనా పండుగలు స్పెషల్ ఈవెంట్లకు హాజరయ్యి తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నోయల్ కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన నెటజన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో ఒకవైపు నోయల్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఉండగా మరొక ఫోటోలో ఒక 40, 50 ఇయర్స్ వచ్చిన వ్యక్తి లాగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోలు పక్కపక్కనే చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి రెండు నెలల్లో ఇంత మార్పా అంటూ నోరెళ్లబెడుతున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ చూస్తే నోయల్ అని గుర్తు పట్టడం ఎంతో ఈజీ. కానీ లావుగా బొద్దుగా చాలా ఫాటీ ఉన్న ఫోటోలో ఒక్కసారిగా చూస్తే నోయల్ అని గుర్తు పట్టడం కష్టమే.

Read More: దుబాయ్‌లో ఫుల్ చిల్.. సితార, గౌతమ్ వీడియో వైరల్!

ట్రెండింగ్ వార్తలు