నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి.. యాంకర్ పై నేటిజన్ ఫైర్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మీ!

May 7, 2024

నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి.. యాంకర్ పై నేటిజన్ ఫైర్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మీ!

బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు..

ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అదే విధంగా మూగజీవాలకు కనక ఏదైనా సమస్య వస్తే మాత్రం ఈమె తల్లడిల్లిపోతూ ఉంటారు. అలాంటి వీడియోలను షేర్ చేస్తూ వాటికి కారణమైనటువంటి వారికి శిక్ష పడాలని కోరుకుంటూ ఉంటారు అయితే మూగజీవాలకు సపోర్ట్ చేస్తూ ఎన్నో సందర్భాలలో ఈమె వివాదాలలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతున్న దృశ్యాలు ఉన్నాయి ఈ వీడియో పై రష్మీ స్పందిస్తూ ఇది చాలా దారుణం మనం ఎందుకు ఇలాంటి వాటిని ఆపలేము అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ వీడియో పై ఒక నెటిజన్స్ స్పందిస్తూ అమ్మాయిలను రేప్ చేస్తున్నారు బట్టలు లేకుండా నగ్నంగా చూపిస్తున్నారు.

అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే స్పందిస్తున్నావు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ దారుణమైనటువంటి కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్ పై స్పందించిన రష్మీ ఈరోజు వాడు ఎద్దును చంపాడు రేపొద్దున నీ పిల్లలను చంపుతాడు. మనిషికి ఎద్దుకి తేడా తెలియని బ్రెయిన్ వాడిది అంటూ తనదైన స్టైల్ లోనే రష్మీ చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Read More: రవితేజ మిస్టర్ బచ్చన్ షూట్ అప్డేట్.. ఆ దేశంలోనే షూటింగ్?

ట్రెండింగ్ వార్తలు