ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాని సంచలన పోస్ట్… ఇండస్ట్రీ సపోర్ట్ ఎవరికి?

May 7, 2024

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాని సంచలన పోస్ట్… ఇండస్ట్రీ సపోర్ట్ ఎవరికి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది ఒక వారం రోజులలో ఎన్నికలు కూడా పూర్తి అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున వేగవంతం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనకు మద్దతుగా నిలబడింది. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురం చేరుకుని ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటున్నారు.

ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికీ ఎంతోమంది నిర్మాతలు దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని పిఠాపురంలో గెలిపించాలి అంటూ ప్రజలందరినీ కోరుతూ ఒక వీడియో చేశారు. ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని అలాంటి నాయకుడి గొంతు చట్టసభలలో వినిపించాలి అంటే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

ఇక ఎన్నికలకు వారం కూడా సమయం లేదు ఇలాంటి తరుణంలో నాని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ట్విట్టర్ వేదికగా నాని స్పందిస్తూ.. సినీ ఫ్యామిలీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలి ఆయన ఎన్నికలలో విజయం సాధించాలని నాతోపాటు ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుందని భావిస్తున్నాను అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కు రోజు రోజుకు సినిమా సెలబ్రిటీల మద్దతు లభిస్తుంది. అలాగే పలువురు దర్శకులు నిర్మాతలు సైతం పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయాలి అంటూ స్పందిస్తున్న సంగతి తెలిసిందే. మరి పిఠాపురం ప్రజలు ఎవరికి మద్దతు తెలియజేస్తారనేది తెలియాల్సి ఉంది.

Read More: అవకాశాలు లేకుండా తొక్కేస్తాం..రాకింగ్ రాకేష్ పై పవన్ ఫ్యాన్స్ మాటల దాడి.. ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు