అవకాశాలు లేకుండా తొక్కేస్తాం..రాకింగ్ రాకేష్ పై పవన్ ఫ్యాన్స్ మాటల దాడి.. ఏమైందంటే?

May 7, 2024

అవకాశాలు లేకుండా తొక్కేస్తాం..రాకింగ్ రాకేష్ పై పవన్ ఫ్యాన్స్ మాటల దాడి.. ఏమైందంటే?

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాకింగ్ రాకేష్ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం తో పాటు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రాకేష్ పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు మాటల దాడి చేశారు.

అవకాశాలు లేకుండా చేస్తామని ఇండస్ట్రీలో తొక్కేస్తామంటూ ఆయన షేర్ చేసిన ఒక వీడియో పై పవన్ కళ్యాణ్ అభిమానులు దారుణమైనటువంటి కామెంట్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు ఇంతకీ రాకేష్ షేర్ చేసినటువంటి ఆ వీడియో ఏంటి అనే విషయానికి వస్తే.. ప్రస్తుతం జబర్దస్త్ కామెడియన్ల అందరు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా చాలామంది పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించగా మరికొందరు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ సైతం వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ నగరీ నియోజకవర్గంలో రోజా తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఒక అవ్వతో మాట్లాడుతూ మీ ఓటు ఎవరికి వేస్తావు అని అడిగారు అయితే ఆ అవ్వ తన ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయని ఆ 15 ఓట్లు ఫ్యాను గుర్తుకు వేస్తానని వైసీపీకి అనుకూలంగా ఉంది.

ఇక ఈ వీడియోని రాకేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు మాటల దాడి చేశారు. దీంతో ఆయన ఈ వీడియోని డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పిఠాపురంలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు ప్రచారం చేస్తే రాని ఇబ్బంది వైసీపీ తరఫున రాకింగ్ రాకేష్ చేస్తే అంత ఇబ్బంది కలిగిందా అంటూ వైసీపీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులపై దాడి చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Read More: ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!

Related News

ట్రెండింగ్ వార్తలు