ఆర్య సినిమాని ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేశారా… ఆ హీరోని ఉద్దేశించి కథ రాశారా?

May 7, 2024

ఆర్య సినిమాని ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేశారా… ఆ హీరోని ఉద్దేశించి కథ రాశారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మొదటి చిత్రం ఆర్య. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అల్లు అర్జున్ కు ఈ సినిమా రెండో సినిమా ఆయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇకపోతే ఆర్య సినిమా విడుదల అయ్యి నేటికీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా 2004 మే 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా విడుదలైనటువంటి ఈ సినిమా అప్పట్లో సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో తిరిగి ఆదే సినిమా యూనిట్ సభ్యులందరూ నేడు ఎంతో ఘనంగా పార్టీ చేసుకోబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు కావడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా సుకుమార్ గారు ఈ సినిమా కథను అల్లు అర్జున్ ని ఊహించి రాయలేదట అల్లరి నరేష్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ రాసారని తెలుస్తుంది. నితిన్ హీరోగా దిల్ సినిమా చేస్తున్న సమయంలో సుకుమార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారట అయితే అప్పుడు దిల్ రాజు ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మీకు డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తాను మంచి కథ సిద్ధం చేసుకోమని చెప్పారట.

ఇక దిల్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఆర్య కథ సిద్ధం చేసుకున్నారు అయితే అల్లరి నరేష్ ను ఊహించి కథ రాసిన ఈ సినిమా అల్లరి నరేష్ వరకు వెళ్లలేదని సుకుమార్ తెలిపారు. ఇక ఈ సినిమా కథ ప్రభాస్ రవితేజ నితిన్ వంటి హీరోల వద్దకు వెళ్లిన ఈ కథ విన్నటువంటి ఈ హీరోలు ఈ కథకు తాము సూట్ అవ్వమని రిజెక్ట్ చేశారట.

ఇలా ఈ హీరోలందరూ కూడా ఆర్య సినిమా నుంచి రిజెక్ట్ చేయడంతో సుకుమార్ అల్లు అర్జున్ వద్దకు ఈ కథతో వెళ్లగా అల్లు అర్జున్ మాత్రం ఈ కథ విన్న వెంటనే సినిమాకి ఓకే చెప్పారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత పుష్ప సినిమా సుకుమార్ డైరెక్షన్లో నటించి అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

Read More: ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాని సంచలన పోస్ట్… ఇండస్ట్రీ సపోర్ట్ ఎవరికి?

ట్రెండింగ్ వార్తలు