దుబాయ్‌లో ఫుల్ చిల్.. సితార, గౌతమ్ వీడియో వైరల్!

January 6, 2024

దుబాయ్‌లో ఫుల్ చిల్.. సితార, గౌతమ్ వీడియో వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి ప్రాణం దానం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. ఇక మహేష్ బాబు భార్య నమ్రత కొడుకు గౌతమ్ కూతురు సితార ల గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇంత చిన్న వయసులోనే సితార గౌతమ్ లు కూడా తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.

గతంలో చాలా సార్లు సితార ఇలా ఎంతో మందికి సహాయం చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గౌతమ్ సంగతి పక్కన పెడితే సితార ఈ వయసుకే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది సితార. ఇక గౌతమ్ వీలైనంతవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇది ఇలా ఉంటే తాజాగా గౌతమ్,సితార ఇద్దరు కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోని తాజాగా నమ్రత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలు అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి బోటింగ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

గౌతమ్ చిన్నా రేస్ బోట్ లాంటిది నడుపుతుండగా వెనకాల వైపు కూర్చున్న సితార గిట్టి గిట్టిగా అరుస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలా అన్న చెల్లి ఇద్దరు కలిసి దుబాయిలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ బాబు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More: గుంటూరు కారం సినిమాకు ప్రభుత్వం షాక్.. వేరే దారి చూసుకోవాల్సిందేనా

ట్రెండింగ్ వార్తలు