రవితేజ మిస్టర్ బచ్చన్ షూట్ అప్డేట్.. ఆ దేశంలోనే షూటింగ్?

May 7, 2024

రవితేజ మిస్టర్ బచ్చన్ షూట్ అప్డేట్.. ఆ దేశంలోనే షూటింగ్?

సినీ ఇండస్ట్రీ లోకి ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. ఈయన సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా కెరియర్ పరంగా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతూ ఉన్నటువంటి రవితేజ చివరిగా ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ రవితేజతో జతకట్టారు. శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా చిత్ర బృందం యుఎస్ లో షూటింగ్ పనులను జరుపుకుంటున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో భాగంగా హీరో హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మరి కొద్దిరోజులు యూఎస్ లోనే షూటింగ్ జరుపుకున్న అనంతరం తిరిగి ఇండియా చేరుకోనున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ రైడ్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Read More: థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చిన వరుణ్ సందేశ్ చిత్రం చూడరా మూవీ!

ట్రెండింగ్ వార్తలు