ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!

May 7, 2024

ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!

అల్లు అర్జున్ నటించినటువంటి ఆర్య సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా సరిగా నేటికీ విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తయింది.2004 మే 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా నేటితో 20 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా విజయాన్ని గుర్తు చేసుకుంటూ చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ.. ఆర్యకు 20 ఏళ్లు ఇది సినిమా మాత్రమే కాదు నా జీవితాన్ని మార్చిన క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను స్వీట్ మెమోరీస్ అంటూ అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు.

ఇక ఈ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సుకుమార్ గారు తన జీవితానికి ఆర్య సినిమా ద్వారా గొప్ప విజయాన్ని అందించారని, అప్పుడు ఆర్య ఇప్పుడు పుష్ప నేను నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం సుకుమార్ గారు అంటూ పలు సందర్భాలలో సుకుమార్ గురించి అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్లో వైరల్ అయ్యాయి.

ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

Read More: నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి.. యాంకర్ పై నేటిజన్ ఫైర్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మీ!

ట్రెండింగ్ వార్తలు