Om Bheem Bush Movie Review: ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.

March 22, 2024

ఓం భీమ్ బుష్

ఓం భీమ్ బుష్

  • Cast : శ్రీకృష్ణ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీ‌కాంత్ అయ్యంగార్ తదితరులు.
  • Director : శ్రీ హర్ష కొనుగంటి
  • Producer : సునీల్ బలుసు
  • Banner : వి సెల్యులాయిడ్స్
  • Music : సన్నీ ఎంఆర్

3 / 5

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందనే విషయాన్ని వస్తే..

కథ: క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి ఫ్రెండ్స్ ఈ ముగ్గురికి జీవితం గురించి ఏ విషయంలోనూ బాధ్యత లేకుండా సరదా సరదాగా వారికి తోచిన పనులను చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా సరదాగా గడుపుతూ ఉన్నటువంటి వీళ్లు ఎలాగైనా పీహెచ్డీ చేయాలని ఓకే యూనివర్సిటీలో పది సంవత్సరాల పాటు ఉంటారు కానీ కాలేజ్ నుంచి వీళ్లను పంపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గుర్ని ఎలా మార్చాయి ?, అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న దయ్యం ఎవరు ఆ దయ్యానికి క్రిష్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆ దయ్యం కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడే ఎందుకు ఉందన్నది ఈ సినిమా కథ

విశ్లేషణ: శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎన్నో ఇలాంటి సినిమాలు వచ్చాయి కానీ సరికొత్త పాయింట్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో చాలా బాగా అలరించారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా బాగానే నటించింది. కాకపోతే ఆమె పాత్రకు పెద్దగా నిడివి లేదు.సెకండ్ హాఫ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చే హారర్ సీన్స్ బాగున్నాయి. మొత్తానికి ఒక అద్భుతమైన సినిమాని చూసిన భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది.

నటీనటుల నటన: ఈ సినిమాలో నటించినటువంటి రాహుల్ రామకృష్ణ శ్రీ విష్ణు, ప్రియదర్శి నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఈ ముగ్గురు ఎంతో అద్భుతంగా నటనను కనపరిచారు. ఇక హీరోయిన్ పాత్రలో ప్రీతి ముకుందన్,అయేషా ఖాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రచ్చ రవి వంటి తదితరులు కూడా వారి పాత్రలకు 100% న్యాయం చేశారు.

బాటమ్ లైన్: ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్సెస్, శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని స్లోగా సాగే సన్నివేశాలు ఉండటం క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోవడం జరిగింది. మొత్తానికి ఈ సినిమా ఓ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి.

Read More: వెండితెర పైకి ఇళయరాజా బయోపిక్.. హీరో ఎవరంటే?

ట్రెండింగ్ వార్తలు