వెండితెర పైకి ఇళయరాజా బయోపిక్.. హీరో ఎవరంటే?

March 21, 2024

వెండితెర పైకి ఇళయరాజా బయోపిక్.. హీరో ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది నటీనటులు జీవితాలకు సంబంధించినది మాత్రమే కాకుండా క్రీడా రంగానికి రాజకీయ రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీల బయోపిక్ సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే త్వరలోనే మరో బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఇళయరాజా గారు ఒకరు. ఈయన ఎంతో అద్భుతమైన మెలోడీలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా మ్యూజిక్ మాస్ట్రోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఇళయరాజా బయోపిక్ సినిమా త్వరలోనే తెరపైకి రాబోతుందని తెలుస్తుంది.

మరి ఈ బయోపిక్ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారు ఏంటి అని విషయానికి వస్తే.. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఇళయ రాజా అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకి అరుణ్ మాథేశ్వర్ దర్శకుడిగా పని చేయగా కనెక్ట్ మీడియా పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీ సమర్పణలో రూపొందుతున్నటువంటి ఈ సినిమా బుధవారం చెన్నైలో ఎంతో ఘనంగా షూటింగ్ పనులను ప్రారంభించుకుంది.

ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇళయ రాజా కమల్ హాసన్ వంటి తదితరులు పాల్గొనే సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో ధనుష్ అలాగే కమల్ హాసన్ ఇద్దరూ కూడా మాట్లాడుతూ సినిమాలపరంగా అలాగే వ్యక్తిగతంగా కూడా ఇళయరాజా గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజానే పని చేయబోతున్నారని సమాచారం.

Read More: ఓటీటీలో మాయమైన సూపర్ హిట్ చిత్రం.. అదే కారణమా?

ట్రెండింగ్ వార్తలు