April 29, 2024
అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన ‘అరణ్మనై 4’ మే 3న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్‌లు Avni Cinemax P Ltd పతాకంపై నిర్మించారు. గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ బాక్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
నలుగురు సంతోషంగా జీవించే కుటుంబంలో దురదృష్టవశాత్తు అనుమానాస్పద పరిస్థితుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. భార్య(తమన్నా) తో గొడవపడి భర్త అడవికి వెళ్లి చనిపోయాడని విచారణలో ఆరోపణలు వస్తాయి. తర్వాత ఆమె ఉరి వేసుకుంది. సుందర్ న్యాయవాది, తమన్నా సోదరుడు. తన సోదరి ఆత్మహత్య చేసుకుంటుందని నమ్మడానికి నిరాకరిస్తాడు.
న్యాయవాదిగా సుందర్ సి పోలీసులకు వ్యతిరేకంగా నిలుస్తాడు. ట్రైలర్‌లో హాంటెడ్ హౌస్‌లో నివసించే రాశితో సహా ఇతర పాత్రలను కూడా చూపించారు. బాక్ అనే దెయ్యం ఆత్మ శక్తులను ఎలా నియంత్రించాలో ఇంట్లో కొందరు చర్చించుకుంటారు.
సుందర్ సి పాత్ర సీరియస్‌గా కనిపించింది. దెయ్యం బాక్‌గా తమన్నా భయపెడుతుంది. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ నవ్వులు పూయించారు. ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది, హిప్హాప్ తమిజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్‌ని ఫెన్నీ ఆలివర్ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. మే 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. డైరెక్టర్ సుందర్ సి గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఆయన చాలా క్లియర్ విజన్ తో సినిమా చేశారు. నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో ‘అరణ్మనై’ 3 సమయంలో అర్ధమైయింది. చాలా అద్భుతమైన టెక్నికల్ టీంతో ఈ సినిమా చేశాం. మ్యూజిక్ వండర్ ఫుల్ గా వుంటుంది. ఈసారి ‘బాక్’ కి గ్లామర్ పెరిగింది. తమన్నా ఇప్పటివరకూ చేయని ఓ కొత్త పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటికే పాట వైరల్ అవుతుంది. సుందర్ గారికి ఆడియన్స్ పల్స్ తెలుసు. ఇందులో హారర్ గ్లామర్ థ్రిల్ కామెడీ అన్నీ వున్నాయి. కోవై సరళ గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరోయన్స్. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఖుష్బు గారు సుందర్ గారికి బ్యాక్ బోన్. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సుందర్ గారు మహిళా పాత్రలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. బాక్ మే 3న వస్తోంది. ఇది పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. ఫ్యామిలీతో కలసి చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఎంజాయ్ చేసే సినిమా ఇది. తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ కి ధన్యవాదాలు’ తెలిపారు.
హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. ‘బాక్’ చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం. సుందర్ సి గారు ఎంత మంచి డైరెక్టరో చెప్పడానికి ట్రైలర్ ఒక ఉదాహరణ. విమన్ పవర్ ని సెలబ్రేట్ చేసే డైరెక్టర్ సుందర్ గారు. ఈ వేడుకలో ఆయన తరపునుంచి ఖుష్బు గారు వుండటం చాలా ఆనందంగా వుంది. రాశిని బెంగాల్ టైగర్ నుంచి చూస్తున్నాను. తను చాలా జెన్యూన్ పర్సన్. ఈ సినిమా అయ్యయో ప్రమోషనల్ సాంగ్ ని చేసినప్పుడు ఇద్దరం కలసి చాలా ఎంజాయ్ చేశాం. హిప్హాప్ తమిళా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిచ్చ ఇచ్చిన విజువల్స్ రిచ్ గా వుంటాయి. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. సుందర్ గారి విజన్ ని అర్ధం చేసుకొని మీ అందరికీ మంచి సినిమా ఇవ్వలానే లక్ష్యంతో పని చేశాం. తప్పకుండా ఈ సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కోవై సరళ గారిని తెలుగు మ సినిమాల్లో ఇంకా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. సురేష్ ప్రొడక్షన్ కి, జాన్వీ గారికి ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమాని ఫ్యామిలీతో పాటు చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
నిర్మాత ఖుష్బు సుందర్ మాట్లాడుతూ… బాక్ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న సురేష్ గారికి, నారంగ్ గారికి ధన్యవాదాలు. సురేష్ ప్రొడక్షన్ కి నా స్పెషల్ థాంక్స్. నా సౌత్ జర్నీ సురేష్ ప్రొడక్షన్ నుంచే మొదలైయింది. బాక్ కంప్లీట్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని కూడా చెప్పాలి. ‘అరణ్మనై’ సిరిస్ లో వచ్చే సినిమా చూడటానికి చిన్న పిల్లలని పట్టుకొని మహిళలూ థియేటర్స్ రావడం జరుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చే సినిమాల్లో బాక్ మరో అడుగుముందుకు వేస్తోంది. మరో సూపర్ డూపర్ హిట్ ఇస్తున్న మా దర్శకుడు సుందర్ గారికి థాంక్స్. కోవై సరళ గారు మా సంస్థలో ఎన్నో చిత్రాలు చేశారు. చాలా సపోర్టివ్ గా వుంటారు. రాశి, తమన్నా చాలా కంఫర్ట్ బుల్ యాక్టర్స్. దర్శకుడు చెప్పింది అర్ధం చేసుకొని చేస్తారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి.. టీంలోని అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. కెమరా వర్క్ చాలా బ్యూటీఫుల్ గా వుంది. హిప్హాప్ తమిళా బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. . అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉండేదని డైరెక్టర్ స్క్రిప్ట్ రిసెర్చ్ లో తెలుసుకున్నారు. అసలు ఈ బాక్ కథ ఏమిటి, తను ఏం చేస్తుందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. బాక్ చాలా మంచి ఎంటర్ టైనర్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా థియేటర్స్ లో అదరగొడుతుంది’ అన్నారు.
కోవై సరళ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత బాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దర్శకుడు సుందర్ గారు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఎంజాయ్ చేసేలా ఈ సినిమాని చాలా అద్భుతంహగా తీర్చిదిద్దారు. తమన్నా, రాశి చాలా చక్కగా నటించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి నటించడం ఆనందాన్ని ఇచ్చింది. ఖుష్బు గారు ఎవర్ గ్రీన్ హీరోయిన్ ప్రొడ్యూసర్. సురేష్ గారు, జాన్వి గారికి ధన్యవాదాలు. బాక్ సమ్మర్ కి మంచి ట్రీట్ లాంటి సినిమా. భయపెడుతూ నవ్విస్తుంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి’అన్నారు.
నిర్మాత జాన్వి నారంగ్ మాట్లాడుతూ.. ‘బాక్’ టీంకి ఆల్ ది బెస్ట్. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ సినిమా తెలగు రాష్ట్రంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. మే3న తప్పకుండా సినిమా థియేటర్స్ లో చూడండి’అని కోరారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Read More: పుష్ప సినిమాలో కేశవ పాత్రలో ఆ హీరో నటించాల్సి ఉండేదా.. అసలు విషయం చెప్పిన సుకుమార్!