Ooru Peru Bhairavakona Movie Review: ఊరి పేరు భైరవకోన సినిమా రివ్యూ, రేటింగ్?

February 15, 2024

ఊరి పేరు భైరవకోన

ఊరి పేరు భైరవకోన

  • Cast : సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ తదితరులు
  • Director : వి ఐ ఆనంద్
  • Producer : అనిల్ సుంకర రాజేష్ దండ
  • Banner : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ హాస్య మూవీస్
  • Music : శేఖర్ చంద్ర

2 / 5

వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ వర్ష హీరో హీరోయిన్లుగా నటించినటువంటి తాజా చిత్రం ఊరి పేరు భైరవకోన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీ ప్రేక్షకులకు ముందుకు రానున్న తరుణంలో ప్రీమియర్ షోస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..

కథ: బసవ( సందీప్ కిషన్) అతని ఫ్రెండ్ జాన్ ( వైవా హర్ష) ఒక దొంగతనం చేసి.. అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు. వీరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా అదే ఊరిలోకి వస్తుంది ఇలా ఈ ఊరిలోకి ఎంటర్ అయిన తర్వాత వీరికి తరచూ వింత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా భైరవకోనలో అన్నీ సంఘటనలు భయానకంగా తోస్తాయి. ఈ సమయంలోనే బసవ దొంగలించిన బంగారాన్ని.. రాజప్ప దక్కించుకుంటాడు. ఇక ఆ బంగారం తిరిగి పొందాలి అంటే అసలు కుదరదు అన్ని ఊర్లతో మాదిరి కాకుండా భైరవకోన ఎందుకు విభిన్నంగా ఉంది? గరుడ పురాణంలో మిస్ అయినటువంటి నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఏమి చెప్పారు. తాను ప్రేమించిన భూమి( వర్ష బోల్లమ్మ) కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? అతనికి భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏమిటి? అనే విషయాలన్నీ తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: సోసియో ఫాంటసీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం కొద్ది ఏమి కాదు పాతాళభైరవి నుంచి మొన్న వచ్చిన బిబిసార వరకు ఈ తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి అయితే కథ ఏదైనా ఆ సినిమాలోని పాత్రలు మనకు కనెక్ట్ అయ్యేలా ఉండటం ఎంతో ముఖ్యం. భైరవకోనలో ఎంగేజింగ్ కంటెంట్ లేదా అంటే కచ్చితంగా ఉంది. అక్కడక్కడా చైర్ ఎడ్జ్ పై కూర్చోబెట్టి టెన్షన్ పుట్టించే సీన్స్ కూడా ఉన్నాయి. కానీ..లాజిక్ కి ఎమోషన్ మిస్ అయిన ఆ సీన్స్ భైరవకోనని గట్టించలేకపోయాయి.

ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం బసవ, భూమి ట్రాక్ విడిగా నడుస్తూ ఉండటం, భైరవకోన అసలు రివిల్ చేయకపోవడంతో సినిమాపై మంచి ఆసక్తి కలుగుతుంది. వైవా హర్షా, వెన్నల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది. కానీ.., ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అప్పటినుంచి ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్దగా కనెక్ట్ కారనే తెలుస్తుంది.

నటీనటుల నటన: ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయితే ఆ సినిమాలోని తన పాత్రకు 100% నాన్ చేసే నటుడు సందీప్ కిషన్. ఈ సినిమాలో కూడా పూర్తిగా తన పాత్రకు న్యాయం చేశారు కానీ లుక్ పరంగా మాత్రం సందీప్ కిషన్ లుక్ పరంగా పెద్దగా మెప్పించలేకపోయారు. భూమి పాత్రలో వర్ష బోల్లమ్మ అదరగొట్టింది. కావ్య థాపర్ కి కూడా కావాల్సినంత స్క్రీన్ స్పేస్ లభించింది . వెన్నెల కిషోర్ వైవా హర్ష వంటి వారందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.

బాటమ్ లైన్: భైరవకోన అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో కాస్త ఫాంటసీ మరీ ఎక్కువగా చూపించారనే చెప్పాలి ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఇదివరకే వచ్చాయి. ఈ సినిమాని కూడా ఓసారి చూడొచ్చు.

Read More: గుంటూరు కారం సక్సెస్ కాకపోయినా శ్రీ లీలకు అక్కడ ప్లస్ అయ్యిందా?

ట్రెండింగ్ వార్తలు