గుంటూరు కారం సక్సెస్ కాకపోయినా శ్రీ లీలకు అక్కడ ప్లస్ అయ్యిందా?

February 15, 2024

గుంటూరు కారం సక్సెస్ కాకపోయినా శ్రీ లీలకు అక్కడ ప్లస్ అయ్యిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీ విడుదల అయింది. ఇలా ఈ సినిమా విడుదల అయినప్పటికీ పెద్దగా థియేటర్లలో ఆదరణ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది కానీ ఈ సినిమాలో శ్రీ లీల డాన్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కూడా కుర్చీ మడత పెట్టే సాంగ్ కు ఎంతో అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఈ పాట యూట్యూబ్లో మంచి వ్యూస్ సాధించి దూసుకుపోతుంది ఇది ఇలా ఉండగా థియేటర్లో విడుదలై సక్సెస్ అందుకొని గుంటూరు కారం సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఐదు భాషల్లో ప్రసారమవుతున్నటువంటి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది ముఖ్యంగా శ్రీ లీల డాన్స్ కి సపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక ఈమెను ఇతర భాష అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇష్టపడుతుండడంతో ఈమెకు ఇతర భాషలలో కూడా మంచి సక్సెస్ లభించింది. ఇలా గుంటూరు కారం సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతూ టాప్ పొజిషన్లో దూసుకుపోతున్నటువంటి తరుణంలో ఈమెకు ఇతర భాష సినిమా అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది గుంటూరు కారం పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా ఈమెకు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని పలువురు భావిస్తున్నారు.

గత ఏడాది స్కంద,ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శ్రీ లీల పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది ఇక ఈమె బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ఎంతో మంది సక్సెస్ అందుకున్నారు ఇక ప్రస్తుతం ఈమె కెరియర్ విషయానికి వస్తే ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది.

Read More: బికినీ వేసుకొని బెడ్ పై విరహవేదనతో మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్!

ట్రెండింగ్ వార్తలు