ఓటీటీ తెలుగులోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ఓపెన్ హైమర్!

March 25, 2024

ఓటీటీ తెలుగులోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ఓపెన్ హైమర్!

ఒకప్పుడు సినిమాలను చూసే వెసులుబాటు కేవలం థియేటర్లలో ఉండటం వల్ల ఇతర భాష చిత్రాలు పెద్దగా వేరే భాషలోకి ప్రేక్షకుల ముందుకు రావడం అనేది తక్కువగా జరిగే అంశం. కానీ ఇటీవల కాలంలో థియేటర్లకు పోటీగా ఓటీటీలు రావడంతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అంతేకాకుండా తెలుగులో విడుదలై ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో రకాల సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇకపోతే ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నటువంటి చిత్రం ఓపెన్ హైమర్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి ఈ సినిమా వచ్చిందనే చెప్పాలి.

హాలీవుడ్లో సక్సెస్ అయినటువంటి ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి జే.రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా ఇప్పటికే హిందీ ఇంగ్లీష్ వర్షంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 119 రూపాయల రెంటు విధానంలో అమలులోకి వచ్చింది. ఇలా ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ఈ సినిమా మార్చ్ 21వ తేదీ నుంచి జియో సినిమాలో కూడా ఇతర భాషలలో అందుబాటులోకి వచ్చింది.

తెలుగుతోపాటు తమిళ కన్నడ మరాఠి వంటి ఇతర భాషలలో ఈ సినిమా జియో ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఏ విధమైనటువంటి రెంట్ లేకుండా ఉచితంగా ఈ సినిమాని చూసే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ సినిమా 96వ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా ఉత్తమ చిత్రంతోపాటు ఏడు విభాగాలలో ఆస్కార్ అవార్డు గెల్చడం విశేషం.

Read More: ఓజీ ను ఢీ కొట్టే ఓమీ.. వైరల్ అవుతున్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్!

Related News

ట్రెండింగ్ వార్తలు