ఓజీ ను ఢీ కొట్టే ఓమీ.. వైరల్ అవుతున్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్!

March 25, 2024

ఓజీ ను ఢీ కొట్టే ఓమీ.. వైరల్ అవుతున్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన హీరోగా ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అయ్యారు అయితే ఈయన రాజకీయాలలో ఉన్న నేపథ్యంలో ఇటీవల సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ఏపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా మారిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఓజీ. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని చివరి దశ షూటింగ్ కార్యక్రమాలను చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటే కనుక షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని సమాచారం.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు పోటీగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయనకు ఇదే మొదటి తెలుగు సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి బావు అని పాత్రలో నటిస్తున్నారు. ఇక ఆదివారం ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పోస్టర్లో భాగంగా ఇమ్రాన్ హష్మీ పొడువాటి జుట్టు కనుబొమ్మపై కత్తి గాటుతో ఆసక్తికరంగా కనిపించారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి చిత్ర బృందం ఓజీ, ఓమి మధ్య వచ్చే సంఘర్షణను ఊహించలేము అంటూ తెలియజేశారు. ఇలా ఈ పాత్ర గురించి ఇలాంటి కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుందని స్పష్టమవుతుంది.

Read More: క్రీడా వ్యవస్థను మార్చమంటున్న హీరో నిఖిల్.. సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్!

ట్రెండింగ్ వార్తలు