ఆ మాలయళ చిత్రం తెలుగులో బుట్టబొమ్మ!

August 31, 2022

ఆ మాలయళ చిత్రం తెలుగులో బుట్టబొమ్మ!

అన్నా బెన్, శ్రీనాథ్‌ బసి, రోషన్‌ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘కప్పెలా’. మహ్మాద్‌ ముస్తాఫా దర్శకత్వంలో 2020లో వచ్చిన లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘బుట్టబొమ్మ’గా రీమేక్‌ అయ్యింది. తెలుగులో అనికా సురేంద్రన్, అర్జున్‌దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ ఈ బుట్టబొమ్మ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గణేష్‌ రావూరి ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు. ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబరులో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ ఏడాది నవంబరులో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇక శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా 2019లో వచ్చిన ‘విశ్వాసం’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన అనిఖా సురేంద్రన్‌ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అజిత్‌ కూతురిగా నటించారు అనిఖా సురేంద్రన్‌. అలాగే ప్రజెంట్‌ నాగార్జున హీరోగా నటించిన ‘ఘోస్ట్‌’ చిత్రంలో కూడా నాగార్జునలో కూడా ఓ కీ రోల్‌ చేశారు అనిఖ. ఈ చిత్రం ఈ 2022, అక్టోబరు 5న విడుదల కానుంది.

ట్రెండింగ్ వార్తలు