Premalu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడంటే?

March 20, 2024

Premalu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడంటే?

సినిమాలో సత్తా ఉంటే చిన్న సినిమాలైనా కూడా ఎంతో మంచి సక్సెస్ అవుతాయని ఇప్పటికీ ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి. ఇలా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలలో ప్రేమలు చిత్రం ఒకటి. రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే తెలుగులో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా చూసిన వారందరూ కూడా ఈ సినిమాపై ఎంతో మంచి రివ్యూ ఇచ్చేశారు. మార్చి 8న రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసి ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ఈ శుక్రవారం తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. ఇలా అన్ని భాషలలో విడుదలవుతున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందనే వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈనెల 29వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని వార్తలు ఇదివరకు వచ్చాయి కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన తెలియజేయలేదు. కానీ తాజాగా ఈ సినిమా మార్చి 29వ తేదీనే డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతుందనే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.

అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 100 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళ వెర్షన్ కూడా రేపు రిలీజ్ అవుతుండటంతో మరో 10 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమలు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఈ రికార్డ్ కొట్టిన ఐదవ మలయాళ సినిమాగా ప్రేమలు సినిమా సరికొత్త రికార్డు అందుకోబోతుందని చెప్పాలి.

Read More: కూతురితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు.. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ?

ట్రెండింగ్ వార్తలు