కూతురితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు.. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ?

March 20, 2024

కూతురితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు.. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. ఈయన శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాంచరణ్ గత కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల ఈయన సినిమా షూటింగ్ కి సంబంధించిన లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే కొద్ది రోజులపాటు షూటింగ్ ఇక్కడే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఉపాసన తన కుమార్తె క్లిన్ కారా కూడా వైజాగ్ చేరుకున్నారు. ఇక ఈ సినిమా విరామ సమయంలో రామ్ చరణ్ తన కూతురు భార్యతో కలిసి వైజాగ్ బీచ్ లో ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన కుమార్తెను ఎత్తుకొని మరి బీచ్ లో ఆడిస్తూ కనిపించారు. సముద్రపు అలలు వస్తూ ఉండగా తన కూతురుతో కలిసి ఈయన ఎంజాయ్ చేశారు.

ఈ విధంగా వీరి వైజాగ్ బీచ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె వైజాగ్ మా హృదయాలను దోచుకుంది. క్లీన్ కారాతో కలిసి మొదటి బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇలా ఈ వీడియోలో భాగంగా రామ్ చరణ్ తన కుమార్తెను నీళ్లలో ఆడించడం చేపలను పట్టి చూపించడం వంటివి చేశారని తెలుస్తోంది. ఇలా ఈ ఫోటోలలో భాగంగా రామ్ చరణ్ కుమార్తె ఫేస్ కనపడకుండా కూడా ఎంతో జాగ్రత్త పడ్డారు. మొత్తానికి ఇలా కూతురుతో కలిసి బీచ్ లో ఈ ముగ్గురు ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ పాత్రను చంపేయాలనుకున్నాను: రాజమౌళి

ట్రెండింగ్ వార్తలు