పెళ్లి చేసుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్… ఏమైందంటే?

April 3, 2024

పెళ్లి చేసుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్… ఏమైందంటే?

ప్రియాంక జైన్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ప్రియాంక బుల్లితెర నటుడు శివకుమార్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పటివరకు తమ పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్స్ మాత్రం తెలియజేయలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వీరు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చెప్పా పెట్టకుండా ఈమె పెళ్లి చేసుకోవడం ఏంటి అనే విషయానికి వస్తే.. ఈమె పెళ్లి చేసుకున్నారు కానీ ఇది నిజమైన పెళ్లి కాదని తెలుస్తోంది.

సాధారణంగా ప్రతి ఒక్క పండుగకు బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఉగాది పండుగ రాబోతున్నటువంటి తరుణంలో స్టార్ మా వాళ్ళు మా ఇంటి పండుగ అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా 10 సెలబ్రిటీ జంటలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి తీరని కోరికలను తీర్చడమే కాన్సెప్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే ప్రియాంక శివకుమార్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని గత కొద్దిరోజులుగా అనుకుంటూ ఉన్నప్పటికీ తరచూ వీరు పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తమ పెళ్లికి తీరని కోరికల మిగిలిపోయిందని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఇతర సెలబ్రిటీలు కమెడియన్లు బుల్లితెర షో లోనే వీరికి పెళ్లి చేశారు. అచ్చం పెళ్లికూతురు పెళ్లి కొడుకు గెటప్ లో వీరిద్దరిలో పెళ్లికళ ఉట్టిపడుతుంది ఇలా అందరి సమక్షంలో వీరు పెళ్లి చేసుకోవడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: పవన్ కంటే నేనే డాన్స్ బాగా చేశాను.. అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు