కాంచన కంటే ముందే వస్తున్న రుద్రుడు

July 3, 2022

కాంచన కంటే ముందే వస్తున్న రుద్రుడు
దర్శక – నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవా లారెన్స్‌ యాక్ట్‌ చేస్తోన్న తాజా సినిమా ‘రుద్రుడు’. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఈ ఏడాది డిసెంబరు 23న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. కతి రేషన్‌ ఈ సినిమాకు దర్శకుడు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పూర్ణిమా భాగ్యరాజ్, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే రాఘవా లారెన్స్‌ కాంచన ఫ్రాంచైజీలో 2019లో ‘కాంచన 3’ రిలీజైంది. ‘కాంచన 3’ సినిమా ఎండ్‌ టైటిల్స్‌లో ‘కాంచన 4’ను ప్రకటించారు రాఘవాలారెన్స్‌.కానీ మధ్యలో ‘రుద్రుడు’ సినిమాకు రాఘవ సైన్‌ చేయడంతో ‘రుద్రుడు’ కంటే ‘కాంచన’ వెనకపడింది. కాగా ప్రస్తుతం రాఘవాలారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో ‘దుర్గ’ అనే హారర్‌ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే

ట్రెండింగ్ వార్తలు