ఎన్టీఆర్ తలుచుకుంటే టిడిపి రాత్రికి రాత్రే ఫినిష్ అవుతుంది.. వర్మ కామెంట్స్ వైరల్!

February 22, 2024

ఎన్టీఆర్ తలుచుకుంటే టిడిపి రాత్రికి రాత్రే ఫినిష్ అవుతుంది.. వర్మ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వర్మ ఇటీవల కాలంలో వివాదాస్పద సినిమాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు ఇక త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈయన ఏపీ రాజకీయాలను ఉద్దేశిస్తూ తీసిన వ్యూహం సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నో టార్గెట్ చేసి చేశారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో వర్మ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు వర్మ షాకింగ్ సమాధానాలు చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ దూరం పెట్టిందా లేకపోతే ఆయనే రాజకీయాలకు దూరంగా ఉన్నారా అనే విషయం గురించి నాకు తెలియదు కానీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని వర్మ తెలిపారు. ఆ భయం టిడిపి నేతలలో కూడా ఉందని వర్మ తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి నేను రాజకీయాలలోకి వస్తానని ప్రకటిస్తే చాలు రాత్రికి రాత్రి టిడిపి ఫినిష్ అవుతుందని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ కనక రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటిస్తే లోకేష్ చంద్రబాబు నాయుడుకు ఏమి మిగలదని ఆ భయంతోనే జూనియర్ ఎన్టీఆర్ పట్ల ద్వేషం పెంచుకున్నారని అందుకే ప్రతి విషయంలోనూ ఆయనని దూరం పెడుతూ వస్తున్నారు అంటూ ఈ సందర్భంగా వర్మ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Read More: మీనా గంటకు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా నటుడి కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు