ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్.. భార్య ప్రేమ పై బన్నీ షాకింగ్ కామెంట్స్!

May 9, 2024

ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్.. భార్య ప్రేమ పై బన్నీ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒపించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాగే ఈ జంట ఎందరికో ఆదర్శంగా కూడా ఉంటుందని చెప్పాలి.

ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ చూడముచ్చటగా కనిపిస్తారు కానీ తాజాగా అల్లు అర్జున్ తమ మధ్య ఉన్నటువంటి అన్యోన్యత గురించి బహిరంగంగా చేస్తున్నటువంటి కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఆర్య సినిమా 20 ఏళ్ల పూర్తి చేసుకోవడంతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్లో భాగంగా యాంకర్ అల్లుఅర్జున్ ని ఒక ప్రశ్న అడిగింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ వన్ సైడ్ లవ్ గురించి మనకు తెలిసిందే.అలాగే నేను జీవితంలో కూడా ఎవరితోనైనా వన్ సైడ్ లవ్ ఉందా అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెబుతూ నా వన్ సైడ్ లవ్ ఎప్పుడూ కూడా స్నేహ అంటూ సమాధానం చెప్పారు..మనం ప్రేమించాల్సిందే తప్ప అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అంటూ ఈయన నవ్వుతూ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా తాను తన భార్యను ప్రేమించిన కూడా ఆమె మాత్రం తనని పెద్దగా ప్రేమించదు అంటూ అల్లు అర్జున్ కామెంట్లు చేయడంతో నిజంగానే వీరి మధ్య సఖ్యత లేదా అంటూ కొందరు కామెంట్లు చేయగా బన్నీ ఏదో సరదాగా అన్నారే కానీ స్నేహ రెడ్డి అంటే తనకు చాలా ప్రాణమని అలాగే ఆమెకు కూడా బన్నీ అంటే ఎంతో ఇష్టం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసే పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.

Read More: ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్ వార్తలు