ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

May 9, 2024

ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కోలీవుడ్ సూపర్ స్టార్ నటుడు రజినీకాంత్ ఒకరు. ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఒక్కో సినిమాకు రజనీకాంత్ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి రజనీకాంత్ ఒకానొక సమయంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినవాడు.

ఈయన ఆఫీస్ బాయ్ గా పనిచేసేవారు అనంతరం రోజు కూలిగా వెళుతూ జీవనం గడిపేవారు.ఇకపోతే తాజాగా ఓ సందర్భంలో రజనీకాంత్ మాట్లాడుతూ తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు తాను పేదరికంలోనే పుట్టానని తెలిపారు. చిన్నప్పటి నుంచి నేను ధనవంతుడిని కావాలి అనే కోరిక నాలో ఉండేది ఇలా ఎన్నో పనులు చేస్తూ తిరిగి బస్సు కండక్టర్గా మారానని రజనీకాంత్ తెలిపారు.

చిన్నప్పటినుంచి నేను ఎంతో ధైర్యవంతుడిని ఏ విషయానికి భయపడేవాడు కాదు కానీ ఒకరోజు మాత్రం ఒక సంఘటనకు భయపడి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ ఈ సందర్భంగా రజినీకాంత్ తెలిపారు. ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి నేను దేవుడిని మొక్కున్నాను అయితే ఆ దేవుడి ఫోటో చూడగానే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కూడా మానుకున్నాననీ తెలిపారు.

ఈ సందర్భంగా రజినీకాంత్ సూసైడ్ అటెంప్ట్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఇక ఇటీవల జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి రజనీకాంత్ ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Read More: విడుదల తేదీ లాక్ చేసుకున్న భజే వాయువేగం.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు