April 17, 2024
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం తాజాగా సోమవారం రోజు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో కలిసి ఆమె ఏడడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖుల కోసం మంగళవారం చెన్నైలో వివాహ విందు ఏర్పాటు చేశారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ తారలు కూడా ఇందులో పాల్గొన్నారు.
చిరంజీవి-సురేఖ దంపతులు, మోహన్ లాల్, అట్లీ, విజయ్ సేతుపతి, జాన్వీ కపూర్, వెట్రీ మారన్, లోకేశ్ కనగరాజ్, అనిరుధ్, రకుల్ ప్రీత్ సింగ్, రెహమాన్, రామ్ చరణ్ తదితరులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్‌లతో అలరించారు. శంకర్ చిన్న కుమార్తె అదితితో కలిసి లుంగీ డ్యాన్స్, వాతి కమింగ్ వంటి పాటలకు స్టెప్పులేశారు. అట్లీ కూడా ఈ డ్యాన్స్‌లో భాగమయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో నేటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read More: చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి.. ఏమి అందంరా బాబు!