April 17, 2024
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేహా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది. సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. ఈ సినిమా తర్వాత అందరూ ఈమెను రాధిక అని పిలవడం మొదలుపెట్టారు.
ఇకపోతే నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవల టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నేహా శెట్టి కామియో రోల్ లో నటించింది. దీనితో మరోసారి సోషల్ మీడియాలో రాధికా అనే పేరు తెగ వైరల్ అవుతోంది. అంతా రాధికా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా నేహా శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో చీర కట్టులో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. పైట కొంగును గాలికి ఎగరవేస్తూ నడుము,నాభి, ఎద అందాలు మొత్తం చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు సూపర్ ఎక్సలెంట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు ఏం అందం రా బాబు అందంతోనే పిచ్చెక్కిస్తోందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Read More: క్లిన్ కారా జాతకం అందుకే బయటపెట్టాను.. గండం ఉంటే ప్రమాదం: వేణు స్వామి