యాంకర్ రష్మీ మరో నాటకం?.. ఇలాంటి వేషాలు ఇంకెన్ని రోజులు వేస్తారు.. మల్లెమాల మీద నెటిజన్లు ఆగ్రహం

December 30, 2023

యాంకర్ రష్మీ మరో నాటకం?.. ఇలాంటి వేషాలు ఇంకెన్ని రోజులు వేస్తారు.. మల్లెమాల మీద నెటిజన్లు ఆగ్రహం

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) ఒకరు ఈమె కెరియర్ మొదట్లో వెండి తెరపై హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అయితే వెండి తెరపై సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరవైపు అడుగులు వేశారు ఇలా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ అందరిని ఎంతో ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మీ గౌతమ్(Rashmi Gautam) ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా కొనసాగే సమయంలోనే సుడిగాలి సుదీర్ తో కలిసి పెద్ద ఎత్తున రొమాంటిక్ పర్ఫామెన్స్ చేసిన సంగతి తెలిసినదే. దీంతో వీరిద్దరూ నిజ జీవితంలో ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకుంటారంటూ కూడా అభిమానులు భావిస్తూ ఉన్నారు.

ఇలా సుధీర్ రష్మీ పలు సందర్భాలలో వారి మధ్య ఉన్న రిలేషన్ బయటపెట్టిన వీరి గురించి వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో రష్మీ పెళ్లి పార్టీ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఈమె తన పెళ్లి గురించి ఒక సీక్రెట్ చెబుతాను అంటూ ఏకంగా తనకు కాబోయే వాడిని అందరికీ పరిచయం చేశారు.తాజాగా ఈ కార్యక్రమం నుంచి విడుదలైనటువంటి ప్రోమో చూస్తే ఈ ప్రోమోలో రష్మీ తన పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని పరిచయం చేశారని తెలుస్తుంది.

రష్మీ పెళ్లి చేసుకుంటానని చెప్పావు నీకు కాబోయే వాడు ఎలా ఉంటాడు ఏంటి అంటూ హైపర్ ఆది అడగగా రష్మీ మాట్లాడుతూ ప్రతి ఒక్క అమ్మాయికి తన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటుందని ఈమె తను కాబోయే వ్యక్తి గురించి చెబుతున్నటువంటి సమయంలోనే వెనుక నుంచి ఒక వ్యక్తి స్టేజ్ పైకి వస్తారు. అయితే ఆయన చూడటానికి ఆరడుగుల ఎత్తు చాలా హ్యాండ్సమ్ గానే కనిపించారు.

ఈమె ఆ వ్యక్తినే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అందరికీ పరిచయం చేశారు. ఇలా ఈ ప్రోమో వైరల్ గా మారడంతో ఈమె నిజంగానే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా లేకపోతే ఇది కూడా ప్రాంఖా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మల్లెమాలవారు తమ కార్యక్రమాలను సక్సెస్ చేసుకోవడం కోసం ఇంకెన్ని రోజులు ఇలాంటి వేషాలు వేస్తారు అంటూ వీరి వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. మరి ఇది నిజమా లేక ఫ్రాంఖా అనే విషయం పూర్తి ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు తెలుస్తుంది.

Read More: పుట్టింటికి వెళ్ళిన లావణ్య త్రిపాఠి

ట్రెండింగ్ వార్తలు