Eagle Movie Review: రవితేజ ఈగల్ రివ్యూ అండ్ రేటింగ్!

February 9, 2024

ఈగల్

ఈగల్

  • Cast : రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ గౌస్ వంటి తదితరులు.
  • Director : కార్తీక్ ఘట్టమనేని
  • Producer : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్
  • Banner : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
  • Music : దవ్ జాంద్

2 / 5

రవితేజ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే..

కథ: నలిని (అనుపమ పరమేశ్వరన్) ఒక నేషనల్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటారు ఈమె ఓసారి మార్కెట్ వెళ్ళినప్పుడు తలకోనలో పండించిన ప్రత్యేక పత్తితో తయారు చేసిన వస్తువులను చూసి ఆశ్చర్యపోతారు అందుకు సంబంధించిన వార్తను న్యూస్ పేపర్ లో ఒక కార్నర్ లో వేస్తారు అది చూసినటువంటి సిబిఐ రా ఏజెంట్ అధికారులు ఈమె కంపెనీపై దాడి చేసి తన ఉద్యోగం తీసేస్తారు. ఇలా ఆ చిన్న వార్తలకు తన ఉద్యోగం తీసేయడం వెనుక ఉన్న కారణం ఏంటి తెలుసుకోవడం కోసం ఈమె తలకోన వెళ్తారు.

తలకోన వెళ్లినటువంటి ఈమెకు అసలు విషయం ఒక్కొక్కటి బయటపడతాయి అక్కడ సహదేవ్ వర్మ (రవితేజ) ప్రతి పండించే ఒక రైతు పాత్రలో కనిపిస్తూ ఉంటారు ఈయన కోసం ఇంటర్నేషనల్ దేశాలన్నీ కూడా వెతకడం ఏంటి రా సిఐడి అధికారులు కూడా ఎందుకు అలా వ్యవహరించారు అనే విషయాలన్నింటిని తెలుసుకుంటూ ఉంటారు. తాను సహదేవ్ వర్మ అయినప్పటికీ ఒకప్పుడు అక్రమ ఆయుఆయుధాలను రవాణా చేసే ఈగల్ అనే విషయాన్ని కూడా నలిని తెలుసుకుంటారు. తాను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిన మాట కోసం వాటన్నింటినీ పక్కనపెట్టి ఒక సాధారణ వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటారు అసలు ఈయనకి ఈగల్ కి సంబంధం ఏంటి? అక్రమాయుధాలకు సహదేవ్ వర్మకు ఉన్న లింక్ ఏంటి? రా, సిబిఐ లాంటి వాళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు. ఈగల్ ఏం చేసాడు? నళిని అతని గురించి పూర్తిగా తెలుసుకుందా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: చెడు మార్గంలో ప్రయాణిస్తున్న హీరోని హీరోయిన్ మార్చి మంచి మార్గంలో ప్రయాణింప చేస్తూ ఉన్న సినిమాలు ఇదివరకే ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందినది అయితే ఈ సినిమాల్లో యాక్షన్స్ సన్ని వేషాలను సరికొత్తగా ప్రేక్షకులకు చూపించారు. కథకి ఒక మంచి మెసేజ్ ని మాత్రం జోడించి దాన్ని యాక్షన్ సినిమాలా చెప్పారు. అక్రమాయుధాల రవాణా, వాటితో జరిపే కాల్పుల్లో సాధారణ ప్రజలు చనిపోవడం లాంటి అంశాన్ని మాత్రం ఇదే మొదటిసారి చూపించడం. ఇక ఈ సినిమా మొదటి భాగం నళిని సహదేవ్ కోసం వెతకడం సరిపోతుంది ఇక రెండవ భాగంలో ఈయన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసుకుంటారు ఇక క్లైమాక్స్ కి ముందు వచ్చే యాక్షన్స్ సన్నివేశం అదుర్స్ అని చెప్పాలి.

నటీనటుల నటన: రవితేజ ఎప్పటిలాగే మాస్ యాంగిల్ లో అందరిని అదరగొట్టారని చెప్పాలి.ఇక ఈ సినిమాలో ఈయన ఫుల్ హెయిర్ గడ్డం లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు.ఇక యాక్షన్స్ సన్ని వేశాలలో అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో కూడా రవితేజ ఎంతో అద్భుతంగా నటించారు. ఇక జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా అద్భుతంగా నటించారు. రవితేజకి జోడిగా కావ్య థాపర్ ప్రేమ సన్నివేశాల్లో క్యూట్ గా కనిపించి అలరించింది. రవితేజ పక్కనే ఉండే పాత్రలో నవదీప్, రా ఆఫీసర్స్ గా అవసరాల శ్రీనివాస్, మధుబాల మెప్పిస్తారు. ఇక ఆ ఊరి ఎమ్మెల్యేగా అజయ్ ఘోష్ అక్కడక్కడ కామెడీ పండించే ప్రయత్నం చేసి మెప్పించారు.

బాటమ్ లైన్: కథ పాతదే నా చూపించిన విధానం కొత్తగా ఉంది చెడు మార్గంలో ప్రయాణించే ఓ వ్యక్తి భార్య కోసం మంచిగా మారి అక్రమాయుధాలు ప్రపంచంలో ఉండకూడదు, ఆయుధం అనేది కాపాడే వాడి చేతిలోనే ఉండాలి కానీ, అర్హత లేని వాళ్ళ చేతిలో ఉండకూడదు అని మంచి మెసేజ్ ని స్టైలిష్ యాక్షన్ గా చూపించారని చెప్పాలి.

Read More: ఆ ఒక్కరు తప్ప అందరూ బలగం చూశారు.. వేణు ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు