గుంటూరు కారంను తొక్కేసిన హనుమాన్.. మహేష్ బాబు రేంజ్ ఇంతేనా?

January 13, 2024

గుంటూరు కారంను తొక్కేసిన హనుమాన్.. మహేష్ బాబు రేంజ్ ఇంతేనా?

తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా హీరో తేజా సజ్జా నటించిన హనుమాన్ సినిమాలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. మొదటినుంచి రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. అయితే ఈ రెండింటిలో ప్రేక్షకులు మొదటి నుంచి ఎక్కువగా హనుమాన్ సినిమా పైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. అలా ఈ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ నిన్న అనగా జనవరి 12 న థియేటర్లలో విడుదల అయ్యాయి. ఇక మహేష్ బాబు సినిమాకు నెగిటివ్ టాకు రాగా, తేజా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.

అయితే మహేష్ బాబు స్టార్ హీరో కావడంతో మొదటి రోజు బాగానే కలెక్షన్స్ సాధించింది. తేజా సజ్జా నటించిన హనుమాన్ సినిమా కూడా కలెక్షన్ల పరంగా శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలలో ఎక్కువ శాతం మంది హనుమాన్ సినిమాలు చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ సంగతి అటు ఉంచితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించి నేటిజన్స్ రకరకాల ట్వట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. నార్త్ అమెరికాలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి అని రాసుకొచ్చారు.

360 లొకేషన్స్ లో విడుదల అయినా హనుమాన్ సినిమా మొదటి రోజు రూ. 325,459 కలెక్షన్లను సాధించింది. 388 లోకేషన్స్ లో విడుదల అయినా గుంటూరు కారం సినిమా రూ. 319,071 కలెక్షన్లను సాధించింది. అదేవిధంగా 191 లోకేషన్స్ లో విడుదల అయిన సైంధవ్ సినిమా 62,486 కలెక్షన్లను సాధించింది. సైంధవ్ సంగతి పక్కన పెడితే గుంటూరు కారం సినిమా థియేటర్స్ సంఖ్య ఎక్కువ అయినప్పటికీ హనుమాన్ సినిమా రేంజ్ లో కలెక్షన్ సాధించలేకపోయింది. దీంతో గుంటూరు కారం సినిమాను హనుమాన్ సినిమా తొక్కేసింది. మహేష్ బాబు రేంజ్ ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: హనుమాన్ మూవీ ఓటీటీలో విడుదల అయ్యేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు