సలార్ రివ్యూ: కన్‌ఫ్యూజ్డ్ నీల్ కథలో.. హై వోల్టేజ్ యాక్షన్!

December 22, 2023

సలార్-పార్ట్1

సలార్-పార్ట్1

  • Cast : ప్రభాస్, శృతిహాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, టిను ఆనంద్, జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరీరావు, ఝాన్సి, జాన్ విజయ్, శ్రేయారెడ్డి, రామచంద్రరాజు, షఫీ తదితరులు
  • Director : ప్రశాంత్ నీల్
  • Producer : విజయ్ కిరగండూర్
  • Banner : హోంబలే ఫిల్మ్స్
  • Music : రవి బస్రూర్

3 / 5

Salaar Review: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన తాజా చిత్రం సలార్(Salaar). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో నేడు గ్రాండ్గా విడుదల అయ్యింది. విడుదలకు ముందే ఏ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎలా ఉంది? నటీనటుల పనితీరు అసలు కథ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..

కథ :

దేవా అలియాస్ సలార్ (ప్రభాస్) అసోంలోని ఒక ప్రాంతంలోని బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు. అయితే ప్రాంతానికి ఆధ్య (శృతిహాసన్)ను కిడ్నాప్ చేసి తీసుకు రావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా దేవా సేవ్ చేస్తాడు. ఆ తర్వాత తన స్నేహితుడైనా దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కొంటూ ఆ ప్రాంతానికి వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వస్తాడు. అసోంలో తన తల్లి (ఈశ్వరీరావు)తో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఆధ్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఒక రాజ్యంగా ఎలా మారింది. ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది. ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కొంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్ (జగపతిబాబు) తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సలార్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ప్రశాంత్ నీల్ సినిమా అంటే గుర్తుకు వచ్చేవి మూవీలో ఎలివేషన్స్. ప్రశాంత్ ఎలివేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. కేజీఎఫ్ సినిమాలు చూసి, వాటిలో వచ్చే ఎలివేషన్స్ చూసి ప్రశాంత్ నీల్ కు అభిమానులుగా మారిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునేందుకు ప్రశాంత్ నీల్ తన 100 పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాడు. సలార్ సినిమా రెండు భాగాలుగా చేస్తున్నట్లు ముందే ప్రకటించిన ప్రశాంత్ అందుకు తగ్గట్టుగానే మొదటి భాగంలో ఎంతవరకు చెప్పచ్చో చెప్పి మిగతాదంతా సస్పెన్స్ లో ఉంచేశాడు. నిజానికి కేజీఎఫ్ సినిమాకి ఈ సినిమాకి ఏదో లింకు ఉందని అందరూ భావిస్తూ వచ్చారు, కానీ సినిమాలో అలాంటి లింక్ ఏమీ లేదు. కానీ చాలా సిమిలర్ పాయింట్స్ కనిపించాయి. కే జి ఎఫ్ వన్, టు కుర్చీ కోసమే జరిగాయి.

నటీనటుల పనితీరు:

ఇకపోతే నటినటుల విషయానికి వస్తే ప్రభాస్ వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమా అనిపించింది. మరి ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ కళ్ళతోనే నటించి భళా అనిపించాడు. తన నటనతో హీరో యిజంతో ప్రేక్షకులను మెప్పించాడు ప్రభాస్. ఈ సినిమాకి ప్రభాస్ తప్ప మరో ఆప్షన్ ఆలోచించలేము అనే అంతలా ప్రభాస్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేసారు. ఇంకా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ఇరగదీసాడని చెప్పవచ్చు. ఒక్కమాటలో ప్రభాస్ తన మాట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించాడు. ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు పృథ్వీరాజ్, ఆయన కూడా ప్రభాస్ తో కొన్ని సీన్స్ లో పోటాపోటీగా నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈశ్వరి రావు కూడా తన అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించింది. శృతిహాసన్ కి తగ్గ రోల్ కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహా, ఝాన్సీ , శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టినూ ఆనంద్ లాంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

బాటమ్ లైన్ : హై వోల్టేజ్ యాక్షన్ మూవీ

ఇంకా చదవండి: డంకీని లేపేసిన స‌లార్! 

ట్రెండింగ్ వార్తలు