డంకీని లేపేసిన స‌లార్!

December 22, 2023

డంకీని లేపేసిన స‌లార్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar) సినిమా, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన డంకీ(Dunki) సినిమాలు తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. డంకీ సినిమా 21వ తేదీ విడుదల కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా నేడు అనగా 22వ తేదీ విడుదల అయింది. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలలో మొదటి రోజు ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ రెండు సినిమాలపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలకు ఉన్న క్రేజ్ ను చూస్తే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌లో డంకీ కంటే స‌లార్(Salaar) ఎక్కువ‌గా రాబ‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తొలిరోజు స‌లార్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేయ‌వ‌చ్చ‌ని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఓవ‌ర్‌ సీస్‌లో యాభై కోట్లు, బాలీవుడ్‌లో 30 కోట్లు, మిగిలిన రాష్ట్రాల్లో 20 కోట్ల వ‌ర‌కు స‌లార్‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చే ఛాన్సెస్ ఉన్నాయ‌ని టాక్. మొద‌టి రోజు స‌లార్ మూవీ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 170 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌నున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 2023లో తొలిరోజు హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టే మూవీగా స‌లార్ రికార్డును క్రియేట్ చేయ‌డం ఖాయ‌ం అంటున్నారు. ఇక డంకీ సినిమా మొదటి రోజు 80 నుంచి 90 కోట్ల మ‌ధ్య గ్రాస్ క‌లెక్ష‌న్స్ వచ్చాయని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌వాన్ త‌ర్వాత వస్తున్న షారుఖ్‌ ఖాన్ మూవీపై భారీగా అంచ‌నాలు ఉన్నాయి.

అయితే ప‌ఠాన్‌, జ‌వాన్‌కు భిన్నంగా కామెడీ డ్రామాతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయ‌డంతో కాస్తంత వెనుక‌బ‌డిపోయింది. ఆ ఎఫెక్ట్ ఒపెనింగ్స్‌పై ప‌డిన‌ట్లు చెబుతోన్నారు. స‌లార్ కంటే తొలిరోజు డంకీ త‌క్కువే వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. మరి ఏ సినిమా కలెక్షన్స్ను సాధించింది అన్న విషయాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Read More:సలార్ ట్విట్టర్ రివ్యూ.. ఉగ్రంనే దించేశాడా?

ట్రెండింగ్ వార్తలు