కాల్పుల ఘటనపై స్పందించిన సల్మాన్ ఖాన్ తండ్రి.. ఆయన రియాక్షన్ ఇదే?

April 15, 2024

కాల్పుల ఘటనపై స్పందించిన సల్మాన్ ఖాన్ తండ్రి.. ఆయన రియాక్షన్ ఇదే?

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరగడంతో ప్రతి ఒక్కరు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఈ కాల్పుల ఘటన ముంబై బాంద్రా ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. కాల్పుల‌ శబ్దంతో స‌ల్మాన్ కుటుంబసభ్యులు ఒక్కసారిగా నిద్రలేచారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన భాయ్ అభిమానులు, శ్రేయోభిలాషులందరినీ ఆందోళనకు గురి చేసింది. మరోవైపు ముంబైలోని బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దీంతో పాటు స‌ల్మాన్ నివాసం వెలుపల కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంత‌లోనే ఘ‌ట‌న‌కు తామే కార‌కుల‌మ‌ని గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ సోద‌రుడు ప్ర‌క‌టించడంతో దీనిపై స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఘటనపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ స్పందించారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై తుపాకీ కాల్పుల భయంకరమైన సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, స‌ల్మాన్ తండ్రి , లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ ఈ విషయంపై తన మౌనాన్ని వీడారు. షూటర్లు పబ్లిసిటీని కోరుకుంటున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు.

వారికి కేవలం ప్రచారం కావాలి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జాతీయ మీడియాతో పేర్కొన్నారు సలీం ఖాన్. అయితే ఈ ఘటన జరిగి కొన్ని గంటలను నడుస్తున్న కూడా ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు. భాయ్ చుట్టూ ఏం జ‌రుగుతుందోనని అంతా ఆందోళ‌న‌గా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం, సల్మాన్ ఖాన్ సన్నిహితులు, రాజకీయ నాయకులు బాబా సిద్ధిక్,రాహుల్ నారాయణ్ కనల్ కూడా ఆందోళనకరమైన సంఘటన అనంత‌రం స‌ల్మాన్ ను క‌లిసారు.

Read More: ఆ ఒక్క మాటతో సినిమాపై అంచనాలను మరింత పెంచిన రష్మిక.. పుష్ప2 లో శ్రీవల్లి 2.0 ని చూస్తారంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు