ఆ ఒక్క మాటతో సినిమాపై అంచనాలను మరింత పెంచిన రష్మిక.. పుష్ప2 లో శ్రీవల్లి 2.0 ని చూస్తారంటూ?

April 15, 2024

ఆ ఒక్క మాటతో సినిమాపై అంచనాలను మరింత పెంచిన రష్మిక.. పుష్ప2 లో శ్రీవల్లి 2.0 ని చూస్తారంటూ?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. గతంలో విడుదల అయిన పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ సాధించింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్ట్ 1 సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2 ని రూపొందిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్నకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా నడుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్ లు, పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసాయి. దానికి తోడు తాజాగా రష్మిక చేసిన వాఖ్యలు ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇంతకీ రష్మిక ఏం మాట్లాడింది అన్న వివరాల్లోకి వెళితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న పుష్ప 2 సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. సినిమా కథ ఏంటి? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? దాన్ని స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు? ఇంతకీ జనాలకు ఏం చూపించబోతున్నారు? అనే అంశాల గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను.

ఇంకా చెప్పాలంటే పుష్ప సినిమాలో నా పాత్ర గురించి అవగాహన లేదు. కానీ, ఇప్పుడు అలా కాదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. సినిమా కథ ఏంటో తెలుసు. ఎలా నటించాలో కూడా తెలుసు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పుష్ప 2 మూవీలో శ్రీవల్లి 2.0ను చూస్తారు అని రష్మిక తెలిపింది. ఈ సందర్భంగా రష్మిక చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: Tillu Square Movie OTT: ఓటీటీ లోకి రాబోతున్న టిల్లు స్క్వేర్ సినిమా .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు