శ్రవనానందంగా ‘సమ్మతమే’ ఫస్ట్ సింగల్
November 29, 2021
రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణమండపం వంటి చిత్రాలతో అలరించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోన్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణ అండ్ సత్యభామ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు.కృష్ణ సత్యభామల మధ్య ఉండే ప్రేమను చూపించేలా..కిరణ్ చాందినీల మధ్య రొమాంటిక్ ట్రాక్‌ను ఈ పాటలో చూపించారు. శేఖర్ చంద్ర మెలోడి ట్యూన్ ఆకట్టుకుంటోంది. కృష్ణ కాంత్ సాహిత్యం యూత్‌ను మెప్పించేలా ఉంది. యాజిన్ నాజిర్, శిరీష భగవతుల గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న సమ్మతమే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.