April 28, 2022
Sammathame Releasing Worldwide On June 24th: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “సమ్మతమే”(Sammathame). గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి(Chandini Chowdary) హీరోయిన్ గా సందడి చేస్తుంది.
ఈ రోజు చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ‘సమ్మతమే’ చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో హీరోయిన్ చాందిని గార్డెన్‌లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీఫుల్ గా వుంది.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ReadMore: Chiranjeevi: ఆచార్యకు కట్టిన వడ్డీతో ఓ మీడియం రేంజ్ సినిమా తీయెచ్చు