మహేష్ కెరీర్లో ఆ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ‘సర్కారు వారి పాట’..

May 20, 2022

మహేష్ కెరీర్లో ఆ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ‘సర్కారు వారి పాట’..

SarkaruVaariPaata: మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మొదటి వారం నుండి మంచి కలెక్షన్లను సాధిస్తోంద‌ని నిర్మాత‌లు తెలుపుతున్నారు. వీకెండ్స్ ఓకే కాని వీక్ డేస్ లో కూడా ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం. నిన్న 8వ రోజున కూడా 7వ రోజుతో సమానంగా కలెక్ట్ చేసింది ఈ మూవీ.. టికెట్ల రేట్లు త‌గ్గినా క‌లెక్ష‌న్స్ ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం ఆలోచించాల్సిన విష‌య‌మే…’సర్కారు వారి పాట’ 8డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం: 31.81 కోట్లు సీడెడ్: 10.66 కోట్లు ఉత్తరాంధ్ర: 10.81 కోట్లు ఈస్ట్: 8.01 కోట్లు వెస్ట్ : 4.93 కోట్లు కృష్ణా: 5.69 కోట్లు గుంటూరు: 8.21 కోట్లు నెల్లూరు : 3.32 కోట్లు ——————————————————– ఏపీ + తెలంగాణ : 83.44 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా : 5.78 కోట్లు ఓవర్సీస్ : 11.52 కోట్లు ——————————————————– వరల్డ్ వైడ్ టోటల్ : 100.74 కోట్లు(షేర్)

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.100.74 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.19.26 కోట్ల దూరంలో ఉంది. మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మహేష్ కెరీర్లో రూ.100 కోట్ల షేర్ వ‌సూలు చేసిన 3వ మూవీ స‌ర్కారు వారి పాట‌

ట్రెండింగ్ వార్తలు