May 10, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో… సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు.
సర్కారు వారి పాట ట్రైలర్ లో క్యారెక్టర్ చాలా కొత్తగా వుంది..క్యారెక్టర్ లో ఇంత ఫ్రెష్ నెస్ కి కారణం?-ముందుగా మీ అందరినీ ఇలా రెండేళ్ళ తర్వాత కలుసుకోవడం ఆనందంగా వుంది. కరోనా కాలంలో అందరం కష్టకాలం ఎదుర్కున్నాం. లాక్ డౌన్ వలన షూటింగ్ పలుమార్లు ఆగింది. చిత్ర యూనిట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిర్మాతలు ఇంత కష్టకాలంలో బలంగా నిలబడ్డారు. వారికి థ్యాంక్స్ చెప్పాలి.సర్కారు వారి పాట క్రెడిట్ దర్శకుడు పరశురాం గారికి దక్కుతుంది. పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా ఎంజాయ్ చేసి పని చేశాను. పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డెలివరీ .. ఇలా ప్రతిది కొత్తగా వుంటుంది.
మేజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాలుగేళ్ళుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అన్నారు.. ఇలా వరుస విజయాలు రావడానికి కారణం అడిగితే ఏం చెప్తారు ?
మంచి కథలు ఎంపిక చేసుకోవడం. అనుభవం పెరగడం కూడా ఒక కారణం. గత నాలుగేళ్ళుగా అద్భుతమైన జర్నీ. సర్కారు వారి పాట కూడా విజయవంతమైన సినిమా అవుతుంది.
సర్కారు వారి పాటని పోకిరితో పోల్చడానికి కారణం ?
సర్కారు వారి పాటలో క్యారెక్టర్ పోకిరి మీటర్ లో వుంటుంది. పోకిరి షేడ్స్ లో వున్న క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. పోకిరి చూస్తే థియేటర్ లో ఒక మాస్ ఫీలింగ్ వుంటుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ సర్కారు వారి పాటతో కుదిరింది.
మీరు చాలా మంది దర్శకులతో పని చేశారు. పరశురాం గారి స్పెషాలిటీ ఏంటి ?
పరాశురాం గారు అద్భుతమై రచయిత. అంత అద్భుతమైన రచయిత దర్శకుడైతే అద్భుతంగా వుంటుంది.
కథ యు.ఎస్ నేపధ్యంలో వుంటుందా ?
కథ ఫస్ట్ హాఫ్ లో యుఎస్ లో మొదలై .. సెకండ్ హాఫ్ వైజాగ్ కి వస్తుంది.
మ మ మహేష్ పాట షూటింగ్ రెస్ట్ లెస్ గా చేశారని విన్నాం ?
రెస్ట్ లెస్ అని కాదు కానీ,, నిజానికి మొదట ఒక సాంగ్ అనుకున్నాం. సినిమా ఫ్లో చూసినప్పుడు ఆ పాట సరిగ్గా కుదరలేదని దర్శకుడు పరశురాం భావించారు. ఒక మాస్ సాంగ్ ఐతే బావుంటుందని టీం మొత్తం నిర్ణయానికి వచ్చాం. తమన్ మమా మహేష్ .. పాట ట్యూన్ వినిపించారు. చాలా ఎనర్జీటిక్ గా అనిపించింది. పది రోజుల్లో ఒక భారీ సెట్ వేసి షూట్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. సర్కారు వారి పాటలో మమ మహేష్ పాట ఒక హైలెట్ గా ఉండబోతుంది.
మీ మెడపై టాటూ ట్రెండీగా వుంది.. ఇది ఎవరి ఆలోచన ?
దర్శకుడు పరశురాం గారికి ఈ క్రిడెట్ దక్కుతుంది. భరత్ అనే నేను షూటింగ్ పూర్తయిన తర్వాత నాకు ఇంకా లాంగ్ హెయిర్ రాలేదు. కానీ ఆ స్టిల్ తీసుకొని మెడపై టాటూ పెట్టి లుక్ ఇలా వుంటుందని చూపించారు. అద్భుతంగా అనిపించింది. తర్వాత లుక్ పై వర్క్ చేయడం మొదలుపెట్టాం.
మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ వుంటుందా ?
నేను, రాజమౌళి గారు చేస్తే పాన్ ఇండియా కాకుండా ఎలా వుంటుంది.
హీరోయిన్ కీర్తి సురేష్ మీ గ్లామర్, టైమింగ్ ని మ్యాచ్ చేయలేనని చెప్పారు ? మీ టైమింగ్ అందుకోవడం అంత కష్టమా?
కీర్తి సురేష్ అలా చెప్పింది కానీ సినిమాలో ఇరగదీసింది. సర్కారు వారి పాటలో కీర్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు ? ఎలాంటి జోనర్ సినిమా ఉండబోతుంది.
సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్ వుంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా.
సముద్రఖని గారి ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఈ పాత్రకి సముద్రఖని గారైతే బావుంటుందని పరశురాం గారికి చెప్పాను. ఆ పాత్ర కు చాలా ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో నేను చాలా కళ్ళ జోళ్ళు వాడను. గుర్తుగా వుంటుంది ఒక కళ్ళ జోడు ఇవ్వమని అడిగారు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పిరియన్స్.
ఏపీ సిఎం జగన్ గారిని కలసినప్పుడు ఎలా అనిపించింది ?
జగన్ గారు చాలా సింపుల్. ఇంత సింపుల్ గా ఉంటారా ? అనిపించింది. మీటింగ్ చాలా ప్లజంట్ గా జరిగింది.
నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచన ఉందా ?
లేదండీ, మీరు ఆ ప్రశ్న అడగ్గానే కాళ్ళు వణుకుతున్నాయి( నవ్వుతూ). ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన బయోపిక్ లో నేను నటించలేను.