డిప్రెషన్ లో ఉన్నానంటున్న జస్వంత్.. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడి!

February 27, 2024

డిప్రెషన్ లో ఉన్నానంటున్న జస్వంత్.. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడి!

ప్రముఖ యూట్యూబర్,బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే గంజాయి కేసులో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అన్న సంపత్ కోసం పోలీసులు అతని ఇంటికి వెళితే తమ్ముడు షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దాంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కేసులో షణ్ముఖ సోదరుడు సంపత్ కోసం అతని ఫ్లాట్ కి పోలీసులు వెళ్ళినప్పుడు గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయారు అన్నదమ్ములు ఇద్దరూ.

షణ్ముఖ్ ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్న షణ్ముఖ్ తాను డిప్రెషన్ లో ఉన్నట్లు చెప్పాడు. తన పరిస్థితి బాగోలేదని సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు, ఆ బాధలోనే గంజాయి తీసుకున్నాను అని ఏడవటం మొదలుపెట్టాడు.ఇక ఆ విషయం పక్కన పెడితే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ పై కేసు బలపడుతుంది. అతను చాలామందిని మోసం చేసినట్లు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. సంపత్ వినయ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

కానీ ఆ తర్వాత ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవడం కోసం రెడీ అవుతున్నట్లు ఆమె కంప్లైంట్ లో పేర్కొంది, తాజాగా మరో కేసు కూడా సంపత్ పై నమోదయింది. సంపత్ తో తోపాటు ఎంబీఏ చదివిన ఒక అమ్మాయి వద్ద 20 లక్షలు తీసుకొని బిజినెస్ పేరుతో మోసం చేశాడని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. కాగా గంజాయి ఎక్కడనుంచి వచ్చిందని విషయం తెలుసుకునేందుకు షణ్ముఖ్ ని పోలీసులు విచారించారు.

కాగా షణ్ముఖ్ శనివారమే బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతని అన్న సంపత్ వినయ్ కి బెయిల్ వచ్చిందా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. గంజాయి దొరికిన మోతాదు చాలా తక్కువే కానీ గంజాయి ఎంత చిన్న మొత్తంలో దొరికినా నేరమే. దీనిపై విచారణ జరుగుతోంది ఎలాంటి శిక్ష పడుతుంది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది అని ఏసీపీ చెప్పారు.

Read More: ఓటీటీ లో రాబోతున్న ఊరి పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ?

ట్రెండింగ్ వార్తలు