ఫిట్నెస్ కోసం చెమటలు చిందిస్తున్న శ్రద్ధాదాస్.. ఫోటోస్ చూస్తే ఆహా అనాల్సిందే!

February 9, 2024

ఫిట్నెస్ కోసం చెమటలు చిందిస్తున్న శ్రద్ధాదాస్.. ఫోటోస్ చూస్తే ఆహా అనాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఆపై కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది.

కాగా ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2 మూవీలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ఆర్య2 త‌ర్వాత శ్ర‌ద్ధా దాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రద్ధా తెలుగులో ప్రసారమవుతున్న ఢీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

గత రెండు సీజన్లుగా ఢీ షోకి జడ్జిగా వ్యవహరించడంతోపాటు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా ఈమె వర్కౌట్ చేస్తున్న ఫొటోస్ ని కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు శ్రద్ధాదాస్ రిబ్బన్ తో ఒంటి కాలుపై నిలబడి ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతూ చెమటలు చిందిస్తోంది.

Read More: రవితేజ అసలు రూపం ఇదేనా.. ఈగల్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు