రవితేజ అసలు రూపం ఇదేనా.. ఈగల్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

February 9, 2024

రవితేజ అసలు రూపం ఇదేనా.. ఈగల్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.

ఇక నేడు రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేను విడుదల అవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా హీరో రవితేజ గురించి కార్తీక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాలలో రవితేజ పాత్ర ఎలా ఉంటుంది అంటే చాలా కామెడీగా అందరిని నవ్విస్తూ సరదాగా ఉండే వ్యక్తిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా విభిన్నమైన వ్యక్తి అంటూ కార్తీక్ వెల్లడించారు. రవితేజ ఎనర్జీ ఒక ఎత్తు అయితే ఆయన వ్యక్తిత్వం మరో ఎత్తు అంటూ కార్తీక్ తెలిపారు.

రవితేజను చూసి మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా నేర్చుకోవాలి అంటే అది క్రమశిక్షణ అని తెలిపారు. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని కార్తీక్ తెలిపారు ఆహారపు అలవాట్లు కానీ పడుకోవడం వంటివి కానీ సరైన సమయానికే చేస్తూ ఉంటారని ఆయన సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి అంటూ ఈ సందర్భంగా కార్తీక్ రవితేజ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ వంటి హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Read More: రాజుల కాలం కాదు…లేకపోతే ఏ రాజో ఎత్తుకుపోయేవాడు!

ట్రెండింగ్ వార్తలు