యానిమల్ మూవీపై సెటైర్లు వేసిన సిద్ధార్థ్.. ఆ సినిమాను మాత్రం చూస్తారంటూ?

April 15, 2024

యానిమల్ మూవీపై సెటైర్లు వేసిన సిద్ధార్థ్.. ఆ సినిమాను మాత్రం చూస్తారంటూ?

తెలుగు ప్రేక్షకులకు హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధార్థ్. అయితే ఇటీవల కాలంలో సిద్దార్థ్ సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. సినిమాలలో నటించకపోయినప్పటికీ ప్రేమ పెళ్లి రిలేషన్ అంటూ తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు సిద్ధార్థ్.. ఇకపోతే హీరో సిద్ధార్థ్ ఏది ఉన్నా కూడా ముక్కు సూటిగా ముఖం మీద చెప్పే అలవాటు ఉంది అన్న విషయం మనందరికి తెలిసిందే. స్టేజ్‌ల మీద, ఇంట‌ర్వ్యూల్లో మాట్లాడేట‌పుడు కొంచెం ఓపెన్‌గా ఉంటాడు. ఎవ‌రి మీదైనా కౌంట‌ర్లు వేయ‌డానికి వెనుకాడ‌డు.

ఏదైనా విష‌యంలో బాధ ప‌డ్డా ఆ బాధ‌ను దాచుకోడు. అలా ఏదీ ఉన్నా కూడా కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తూ ఉంటారు.. త‌న చివ‌రి సినిమా చిత్తా తెలుగు వెర్ష‌న్ చిన్నాను తెలుగులో రిలీజ్ చేద్దామంటే థియేట‌ర్లు దొర‌క‌లేదంటూ స్టేజ్ మీద ఆవేద‌న స్వ‌రంతో మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా ఒక మోస్త‌రుగా ఆడి వెళ్లిపోయింది. కానీ మంచి సినిమాగా మాత్రం పేరు తెచ్చుకుంది. చిన్న‌పిల్ల‌ల మీద లైంగిక వేధింపుల నేప‌థ్యంలో సాగే ఆ సినిమాను అంద‌రూ చూసి త‌ట్టుకోలేర‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే ఇదే విష‌యమై ఒక అవార్డుల కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు సిద్ధార్థ్.

చిత్తా సినిమాను చూడ‌డం క‌ష్ట‌మ‌ని ఒక్క మహిళ కూడా త‌న‌తో కానీ, ద‌ర్శ‌కుడు అరుణ్‌తో కానీ చెప్ప‌లేద‌ని కానీ మ‌గాళ్లు మాత్రం చాలామంది ఈ సినిమా చూసి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని కామెంట్లు చేశార‌ని సిద్దార్థ్ తెలిపారు. త‌మ సినిమా విష‌యంలో ఇలా మాట్లాడిన వాళ్లే మృగం అనే సినిమాను మాత్రం చూస్తార‌ని. కానీ వాళ్ల‌కు చిత్తా సినిమా మాత్రం డిస్ట‌ర్బింగ్‌గా అనిపిస్తుంది అంటూ కాస్త సెటైరిగ్గా మాట్లాడాడు సిద్దార్థ్. చిత్తా లాంటి సినిమాను చూసి డిస్ట‌ర్బింగ్‌గా ఉంద‌ని అన‌డం సిగ్గు చేట‌ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులు మారుతార‌ని ఆశిస్తున్నాన‌ని సిద్దార్థ్ వ్యాఖ్యానించాడు. మృగం అంటూ త‌మిళంలో చెప్పాడు కానీ.. నిజానికి అత‌ను కౌంట‌ర్ వేసింది యానిమ‌ల్ మూవీ గురించే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ సినిమాను వివిధ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ప‌లు ర‌కాలుగా విమ‌ర్శించారు. ఇప్పుడు ఈ జాబితాలో సిద్దార్థ్ కూడా చేరాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రధానం.. ఉపాసన రియాక్షన్ ఇదే!

Related News

ట్రెండింగ్ వార్తలు