April 15, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన సేవలకు గాను యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో ఈ విషయంపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకోవడం పై ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
రామ్ చరణ్ తో కలిసి ఈమె దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు డాక్టర్ రామ్ చరణ్ సో ప్రౌడ్ అఫ్ యు అంటూ ఈమె పోస్ట్ చేశారు.ఇలా తన భర్తకు డాక్టర్ రేట్ రావడం చాలా గర్వకారణంగా ఉంది అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో రామ్ చరణ్ తన కెరియర్ పరంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే.
ఇలా రామ్ చరణ్ కు ఇటీవల పెద్ద ఎత్తున అవార్డులు పురస్కారాలు రావడంతో అభిమానులు మెగా ఇంటిలోకి క్లిన్ కారా వచ్చిన వేలా విశేషం అన్ని శుభాలే జరుగుతున్నాయి అంటూ చిన్నారిని కూడా హైలెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకోగా తాజాగా డాక్టరేట్ పొందడంతో డాక్టర్ రామ్ చరణ్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేయగా మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. ఒకటి సుకుమార్ దర్శకత్వంలో చేయగా మరొకటి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్నారు.
Read More: వేణు స్వామి మిర్చి స్పూఫ్ చూసి ప్రభాస్ అలా అన్నారా?