ప్రమాదానికి గురైన సింగర్ మంగ్లీ కారు… ఆందోళనలో ఫాన్స్?

March 18, 2024

ప్రమాదానికి గురైన సింగర్ మంగ్లీ కారు… ఆందోళనలో ఫాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మంగ్లీ ఒకరు. ఈమె తాజాగా ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి వస్తూ ఉండగా తన కారు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మంగ్లీ స్వల్ప గాయాలు పాలయ్యారనే విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. ఆ తరువాత అర్ధరాత్రి తిరిగొస్తుండగా డీసీఎం వారి కారును ఢీకొట్టింది. వీరు అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి ప్రయాణిస్తూ ఉండగా డిసిఎం వాహనం వెనుక నుంచి వీరు కారణం ఢీ కొట్టింది.

ఇలా ఒక్కసారిగా డీసీఎం వీరి కారును ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి మేఘరాజ్ ,మనోహర్, మంగ్లీ ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి అయితే డీసీఎం డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులకు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇలా సింగర్ మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒకసారిగా అభిమానుల ఆందోళన చెందారు. అయితే ఈమె పోలీసులతో సహా దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More: సూర్య 43 వచ్చేది అప్పుడేనా… కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్!

ట్రెండింగ్ వార్తలు