సూర్య 43 వచ్చేది అప్పుడేనా… కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్!

March 18, 2024

సూర్య 43 వచ్చేది అప్పుడేనా… కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు సూర్య ఒకరు. ఈయన కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సూర్య సినిమాలు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈయన కంగువ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ సూర్య కెరియర్ పరంగా ఎంతో బిజీగా అయ్యారు. ఇకపోతే ఈయన తన 43వ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఆకాశమే నీ హద్దురా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు గాను సూర్య ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవటం గమనార్హం.

మరోసారి తిరిగి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రస్తుతం సూర్య 43 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాని స్వయంగా సూర్య తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ నటి నజ్రియా వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాల గురించి తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని త్వరలోనే షూటింగ్ ప్రారంభం చేసుకుని ఈ ఏడాది నవంబర్ చివరన లేదా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ అభిమానులలో ఎంతో జోష్ నింపాయి.

Read More: టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు