విప్లవానికి నాంది..చైతన్యానికి పునాది అల్లూరి

July 4, 2022

విప్లవానికి నాంది..చైతన్యానికి పునాది అల్లూరి

శ్రీ విష్ణు పోలీసాఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘అల్లూరి’. ప్రదీప్‌ వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కయాదు లోహర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు శ్రీ విష్ణు. ‘విప్లవానికి నాంది..చైతన్యం, చైతన్యానికి పునాది…నిజాయితీ’ నిజాయితీకమారు పేరు అల్లూరి అన్న డైలాగ్స్‌తో టీజర్‌ సాగింది. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్‌ వినిపిస్తోంది..

ట్రెండింగ్ వార్తలు