హ్యాట్రిక్ కి సిద్ద‌మైన సూర్య‌.. ప్యాన్ ఇండియా మూవీగా ఈటీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

January 2, 2022

హ్యాట్రిక్ కి సిద్ద‌మైన సూర్య‌.. ప్యాన్ ఇండియా మూవీగా ఈటీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Etharkkum Thunindhavan: గ‌జిని, సింగం లాంటి సినిమాల‌తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో సూర్య‌. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన ‘ఆకాశం నీ హద్దురా`, జైభీమ్‌ సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. ఈ సినిమాల‌ వల్ల అమెజాన్ ప్రైమ్ భారీ లాభాలను పొందింద‌ని స‌మాచారం. ఈ సినిమాల‌కు గాను సూర్య తన కెరీర్ బెస్ట్ క్రిటిక్స్ ప్రశంసలను అందుకున్నాడు.

Read More: దుబాయ్‌లో మ‌హేష్‌ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌..ఫోటోలు వైర‌ల్‌

తాజాగా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా సూర్య కొత్త చిత్రం ఈటీ(ఎథరక్కుమ్ తునిన్దవన్)టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. పాండిరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. సూర్య స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

Read More: ప్ర‌భాస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్‌

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లో #ET #ఈటి #ಈಟಿ #ഇറ്റി #ईटी అంటూ ఈ నాలుగు హ్యాష్ ట్యాగుల్ని జోడించారు. అంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుత‌ల‌కాబోతుంది అన‌మాట‌. పాండిరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కాబ‌ట్టి ఈ సినిమామీద బజ్ చాలా బాగుంది. ఈ సినిమాతో మ‌రో హిట్ సాధించి హ్యాట్రిక్ కొడ‌తాడో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు