వారెవ్వా…కంగువా!

July 23, 2023

వారెవ్వా…కంగువా!

అందర్నీ ఆశ్చర్యపరచేలా ఉంది ‘కంగువా’ గ్లింప్స్‌ వీడియో. సూర్య మేకోవర్‌, దర్శకుడు శివ మేకింగ్‌, దేవి శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌..అన్నీ అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయని సినీ లవర్స్‌ చెప్పుకుంటున్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కంగువా’. హిస్టారికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా రూపొందుతున్న సినిమా ఇది. స్టూడియోగ్రీన్‌ కేజీ జ్ఞానవేల్‌ రాజా, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జూలై 23న సూర్య బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కంగువా’ సినిమా గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.

తమిళ న్యూ ఇయర్‌ సందర్భంగా కంగువా తొలిపార్టు

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘కంగువా’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ‘కంగువా’ తొలిపార్టును ఏప్రిల్‌ 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఓ యుద్దవీరుడు అంతచిక్కని వ్యాధికిలోనై మరణిస్తాడు. అసలు..వ్యాధి ఏమిటీ? ఆ వీరుడికి ఈ వ్యాధి ఎలా సోకింది? అనే కోణంలో ఈ సినిమా కథ ఉంటుందట. 18వ శతాబ్దంలో కొంత, ప్రజెంట్‌ టైమ్‌లో కొంత స్క్రీన్‌ ప్లే ఉంటుందని తెలిసింది.

‘సూరారైపోట్రు’ సినిమా కాంబో రిపీట్‌!

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా దర్శకులు సుధాకొంగర తెరకెక్కించిన సినిమా ‘సూరారైపోట్రు’.  తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాను ఆడియన్స్‌ విపరీతంగా ఆదరించారు. డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. జీవీ ప్రకాష్‌కుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. అయితే సూర్య, సుధా కొంగర, జీవీ ప్రకాష్‌కుమార్‌కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈ సినిమా కూడా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రా నుంది.

ఈ సినిమాలు కాకుండా తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో వాడివాసల్‌ అనే సినిమాకు కమిటైయ్యారు సూర్య. ఇది కూడా 18వ శతాబ్దపు కథయే. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రజెంట్‌ ‘విడుదలై 2’  పనుల్లో బిజీగా ఉన్నారు వెట్రిమారన్‌. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘వాడివాసల్‌ ప్రారంభం అవుతుంది.

READ MORE: త్రివిక్రమ్‌, తమన్‌లకు టైమ్‌ లేదు..బ్రో…

ట్రెండింగ్ వార్తలు